దలాల్‌లో సెన్సెక్స్‌ ఢమాల్‌: మూడు రోజుల్లో 2 వేలకు పైగా పాయింట్ల పతనం

20 Jan, 2022 16:18 IST|Sakshi

Stock Market Closed Update: దేశీ స్టాక్‌ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 634 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో ట్రేడ్‌ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే దలాల్ స్ట్రీట్‌లో  గత మూడు రోజుల్లో సెన్సెక్స్‌ 2 వేల పాయింట్లకు పైగా పతనం కావడం గమనార్హం. 


గురువారం 60, 045 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్‌.. 59, 068 పాయింట్ల కనిష్టానికి టచ్‌ అయ్యి.. చివరికి 59, 464 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయ్యింది.  నిన్నటి ముగింపుతో పోలిస్తే.. 1.06 శాతం నష్టంతో సెన్సెక్స్‌ క్లోజ్‌ అయ్యింది. మంగళ, బుధ వారాల్లో వరుసగా 656, 554 పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్‌. 

ఇక నిఫ్టీ 17, 921 పాయింట్ల వద్ద గురువారం మొదలై.. ఒకానొక టైంలో 17, 648 పాయింట్లకు చేరి.. చివరికి 17, 757 పాయింట్ల వద్ద ముగిసింది. కిందటి రోజుతో పోలిస్తే.. ఈ పతనం 1.01 శాతం దిగజారింది. 

భారత ఈక్విటీ మార్కెట్‌ కీలక సూచీలు పతనం కావడంతో ప్రత్యేకించి ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ దారుణంగా నష్టపోయాయి.  ఐటీ స్టాక్స్‌ వరుసగా మూడో రోజూ భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హిందుస్థాన్‌ యునిలివర్‌, డాక్టర్‌ రెడ్డీ ల్యాబోరేటరీస్‌, సన్‌ ఫార్మా నష్టాల సెన్సెక్స్‌లో నష్టాలు చవిచూశాయి.

>
మరిన్ని వార్తలు