భారీ నష్టాల నుంచి బయటపడ్డ స్టాక్‌ మార్కెట్‌

28 Jul, 2021 15:52 IST|Sakshi

ముంబై: ప్రారంభమైంది మొదలు వరసుగా పాయింట్లు కోల్పోతూ భారీ నష్టాల దిశగా పయణించిన స్టాక్‌ మార్కెట్‌ చివరకు తేరుకుంది. మార్కెట్‌ ముగిసే సమయానికి ఇన్వెస్టర్ల నమ్మకాని పొంది భారీ నష్టాల నుంచి బయట పడింది. అంతర్జాతీయ మార్కెట్‌ సూచీల ప్రభావానికి తోడు ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ ఇండియా జీడీపీని తగ్గిస్తూ అంచనాలు వెలువరించడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. మార్కెట్‌ ప్రారంమైననప్పటి నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలు జరిపేందుకు ఆసక్తి చూపించారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సెక్సెక్స్‌, నిఫ్టీలు ఊగిసలాడుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం వరకు అమ్మకాలు జోరు కనిపించినా... ఆ తర్వాత క్రమంగా మార్కెట్‌ పుంజుకుని భారీ నష్టాల నుంచి బయట పడింది.

కోలుకుంది
బీఎస్‌ఈ సెక్సెక్స్‌ ఈ రోజు ఉదయం 52,673 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లూ కోల్పోతూ వచ్చింది. ఓ దశలో 51,802 పాయింట్ల కనిష్టానికి చేరుకుని 641 పాయింట్లను కోల్పోయి ఇన్వెస్టర్లను బెంబేలెత్తించింది. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటూ మార్కెట్‌ ముగిసే సమయానికి 135 పాయింట్లు నష్టపోయి 52,443 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం ఈ రోజు ఉదయం 15,761 పాయింట్ల వద్ద ట్రేడ్‌ ప్రారంభమైంది. ఓ దశలో 15,513 పాయింట్లకు పడిపోయింది..మధ్యాహ్నం నుంచి క్రమంగా మార్కెట్‌ కోలుకుంది. చివరకు  37 పాయింట్లు నష్టపోయి 15,709 పాయింట్ల వద్ద ముగిసింది. ఎయిర్‌టెల్‌ కంపెనీ ప్లాన్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో  కంపెనీ షేర్లు లాభాల బాట పట్టాయి.
 

>
మరిన్ని వార్తలు