నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

19 May, 2021 16:26 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు (మే 19) నష్టాల్లో ముగిశాయి. 50 వేల మార్కును దాటి ఒక రోజు లోపే మళ్లీ దిగువకు సెన్సెక్స్‌ జారుకుంది. ఉదయం నుంచే ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు కొంత సేపు ఊగిసలాట ధోరణి కనబరిచాయి. చివరకు మధ్యాహ్నం తర్వాత చిన్నగా నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక రంగాలకు సంబందించిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం 50,088 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 290 పాయింట్ల నష్టంతో 49,902 వద్ద ముగిసింది. దీంతో పాటే నిఫ్టీ కూడా అదే ట్రెండ్‌ కొనసాగించింది. 15,058 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 15,133-15,008 మధ్య కదలాడి చివరకు 77 పాయింట్ల నష్టంతో 15,030 వద్ద ముగిసింది. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.15 వద్ద ఉంది. అలాగే గత రెండు రోజుల లాభాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపినట్లు తెలుస్తుంది. సెన్సెక్స్‌ సూచీలో సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, బజాజ్‌ఆటో, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ లాభాల్లో కొనసాగుతుంటే.. ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, భారతీయ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.

చదవండి:

చిన్న ట్వీట్ తో మూడవ స్థానానికి ఎలోన్ మస్క్

మరిన్ని వార్తలు