నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!

22 Mar, 2021 16:36 IST|Sakshi

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ల సోమవారం ట్రేడింగ్‌ నష్టాలతో ముగిసాయి. దేశీయంగా పెరుగుతున్న కోవిడ్‌-19 కేసుల ఆందోళనకు తోడు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో సోమవారం(మార్చి 22) కీలక సూచీలు నష్ట్టాలను ఎదుర్కొన్నాయి. ఉదయం 49,857 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ 49,281 వద్ద కనిష్ఠాన్ని తాకి 49,878 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 86 పాయింట్లు నష్టపోయి 49,771 వద్ద ముగిసింది. ఇక 14,736 వద్ద ప్రారంభమైన నిఫ్టీ ట్రేడింగ్ రోజులో 14,763-14,597 మధ్య కదలాడుతూ చివరకు 7 పాయింట్ల స్వల్ప నష్టంతో 14,736 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.36 వద్ద నిలిచింది.

చదవండి:

పడిపోయిన బంగారం ధరలు

మరిన్ని వార్తలు