స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

6 Jul, 2021 17:36 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్పంగా నష్ట పోయాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో సెన్సెక్స్‌ 249 పాయింట్లు లాభపడి 53,129 వద్ద గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ సైతం తొలిసారి 15,900 మార్క్‌ను దాటింది. తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో  సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. చివరకు సెన్సెన్స్‌ 18.82 పాయింట్లు నష్టపోయి 52,861 వద్ద ముగిస్తే. నిఫ్టీ 16.10 పాయింట్లు కోల్పోయి 15,818 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.55గా ఉంది. 

అల్ట్రాటెక్ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కొటాక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌ షేర్లు లాభపడితే.. టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, మారుతీ, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, రిలయన్స్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాలు ముగిశాయి. 

మరిన్ని వార్తలు