రెపోరేట్ల దెబ్బ, నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు!

5 May, 2022 09:44 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లను నష్టాలు వీడడం లేదు. వరుసగా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు బుధవారం ఆర్బీఐ కీలకమైన రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకున్న మదుపర్లు అలెర్ట్‌ అయ్యారు. దీంతో గురువారం ఉదయం స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 

ఆర్బీఐ రెపో రేట్ల పెంపు నిర్ణయం రియల్‌ ఎస్టేట్‌, సాధారణ వ్యాపార కార్యకలాపాలు, ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌ వంటి రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయనే నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో గురువారం ఉదయం 9.30 నిమిషాలకు సెన్సెక్స్‌ 478 పాయింట్లు నష్టపోయి 56117 పాయింట్లు వద్ద నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయి 16817 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ ను కొనసాగిస్తుంది. 


హీరో మోటోకార్ప్‌, టెక్‌ మహీంద్రా,ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, ఇన్ఫోసిస్‌,టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ఆటో, ఎం అండ్‌ ఎం షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా కాన్స్‌,నెస్లే, రిలయన్స్‌, టైటాన్‌ కంపెనీలు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

మరిన్ని వార్తలు