ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు!

2 Jan, 2023 09:44 IST|Sakshi

గతేడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్‌ మార్కెట్‌లు కొత్త ఏడాది ప్రారంభ రోజు ఫ్లాటుగా ట్రేడింగ్‌ను మొదలు పెట్టాయి. నిఫ్టీ 18100 పాయింట్లకు పైకి ఎగబాకింది.సెన్సెక్స్‌  118 పాయింట్ల లాభంతో 60,959 వద్ద ట్రేడ్‌ అవుతుండగా నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 18,145 వద్ద ట్రేడింగ్‌ కొనసాగుతుంది.

కానీ కొద్ది సేపటికే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో సోమవారం ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్‌ 42 పాయింట్ల స‍్వల్ప నష్టంతో 60798 వద్ద ట్రేడ్‌ అవుతుండగా.. నిఫ్టీ అత్యల్పంగా 9 పాయింట్లు నష్టాలవైపు పయనమవుతున్నాయి. 

నిఫ్టీ -50లో టాటా స్టీల్‌, హిందాల్కో, టాటామోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బీపీసీఎల్‌, ఎస్‌బీఐలు నష్టాల్లో కొనసాగుతుండగా.. నిఫ్టీ -50లో టాటా స్టీల్‌, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్‌,ఓఎన్‌జీసీ,బీపీసీఎల్‌ షేర్లు లాభాల వైపు మొగ్గుచూపుతున్నాయి. 


 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు