లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

3 Jan, 2023 09:54 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమై వెనువెంటనే లాభాల్లో పయనించాయి.

ఉదయం 9.48గంటల సమయంలో సెన్సెక్స్‌ 15పాయింట్ల లాభంతో 61182 వద్ద ట్రేడ్‌ అవుతుండగా నిఫ్టీ 4 పాయింట్ల అత్యంత స్వల్ప లాభంతో 18202 వద్ద కొనసాగుతుంది. 

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సిప్లా, యాక్సిస్‌ బ్యాంక్‌, దివీస్‌ ల్యాబ్స్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా,బజాజ్‌ ఆటో, ఏసియన్‌ పెయింట్స్‌, కొటక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. 

ఓఎన్‌జీసీ, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ, రిలయన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బీపీసీఎల్‌,కోల్‌ ఇండియా, బ్రిటానియా,టాటా స్టీల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు