అదానీ సంక్షోభం నుంచి తేరుకున్న మార్కెట్లు.. లాభాల్లో దేశీయ సూచీలు

20 Feb, 2023 10:46 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట‍్లపై అంతర్జాతీ అంశాలు కలిసొస్తున్నాయి. దీంతో సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 

ముఖ్యంగా ద్రవ్యోల్బణం, జాబ్‌ మార్కెట్‌పై వృద్ది సాధించేలా యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ ఏడాది మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు వడ్డీ పెంచే అవకాశం ఉందంటూ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ నివేదికలు, ఎస్‌జీఎక్స్‌ మార్కెట్‌లో మిశ్రమ ఫలితాలు, చైనాలో కోవిడ్‌ పరిస్థితులతో మదుపర్లు దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. 

ఫలితంగా ఈ రోజు ఉదయం 10.30గంటలకు సెన్సెక్స్‌ 125 పాయింట్ల లాభంతో 61141 వద్ద ట్రేడ్‌ అవుతుండగా నిఫ్టీ 21 పాయింట్ల స్వల్ప లాభాలతో 17965 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. 

ఇక ఎయిర్‌ టెల్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ,ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎథేర్‌ మోటార్స్‌, లార్సెన్‌, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, సిప్లా, అదానీ పోర్ట్స్‌, బ్రిటానియా, యూపీఎల్‌, టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌,నెస్లే, టైటాన్‌ కంపెనీ షేర్లు నష్టాల్ని మూటగట్టుకుంటున్నాయి.      

మరిన్ని వార్తలు