సాక్షి మనీ మంత్ర : ఒడిదుడుకుల్లో దేశీయ స్టాక్‌ సూచీలు

25 Sep, 2023 09:39 IST|Sakshi

అమెరికా గృహ అమ్మకాల డేటా విడుదల, క్రూడాయిల్‌ ధరల పెరుగుదల, యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం, బాండ్లపై అధిక దిగుబడులతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర సెంటిమెంట్‌తో పాటు ఇతర కారణాల వల్ల సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభ నష్టాల మధ్య కొనసాగుతున్నాయి. 

ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్‌ 46 పాయింట్ల స్వల్ప నష్టంతో 66011 వద్ద, నిఫ్టీ 1 పాయింట్‌ నష్టంతో 19672 వద్ద కొనసాగుతున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌,మారుతి సుజికీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, ఏసియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, లార్సెన్‌, హీరోమోటో కార్ప్‌, బ్రిటానియా, ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు