రెపోరేట్లు పెంచిన ఆర్‌బీఐ, నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు

7 Dec, 2022 11:07 IST|Sakshi

ఆర్‌బీఐ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకటన నేపథ్యంలో దేశీయ సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. 

రెపోరేట్ల పెంపు, కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తోపాటు 8న హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఫలితాలపై మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. 

దీంతో బుధవారం ఉదయం 11 గంటలకు సెన్సెక్స్‌ 184 పాయింట్లు నష్టపోయి 62441 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 18575 వద్ద కొనసాగుతుంది. 

ఇక బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌,ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌,యూపీఎల్‌, టాటా స్టీల్‌, కొటాక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, విప్రో, కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, హీరోమోటో కార్ప్‌ షేర్లు నష్టాల్లో కొనసాతుంటే.. బీపీసీఎల్‌,లార్సెన్‌, హెచ్‌యూఎల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టాటా కాన్స్‌, నెస్లే షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 

>
మరిన్ని వార్తలు