Stock market: నష్టాలు.. ఆ వెంటనే స్వల్ఫంగా కోలుకున్న మార్కెట్‌!

20 Oct, 2021 10:28 IST|Sakshi

Stock Market LIVE Updates: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభనష్టాల మధ్య కదలాడుతున్నాయి. లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే ఆ వెంటనే స్వల్ఫంగా లాభపడింది. 


గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఏడు రోజుల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే.  బుధవారం ఉదయం అదే ట్రెండ్‌ కనిపించింది. కీలక కంపెనీల షేర్లు నష్టాల్లో జారుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ సూచీలు మాత్రం నష్టాలు చవిచూస్తున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 212 పాయింట్లు నష్టపోయి 61,504 వద్ద.. నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో 18,330 వద్ద కొనసాగాయి. అయితే కాసేపటికే స్వల్ఫంగా పుంజుకుని ప్రస్తుతం(10గం.27ని. వద్ద) సెన్సెక్స్‌ 61, 725 వద్ద, నిఫ్టీ 18, 410 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.34 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభనష్టాల నడుమ ఊగిసలాడుతున్నాయి. భారతీఎయిర్‌టెల్‌ 32.25 పాయింట్లతో లాభపడింది.  నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌,  ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్అండ్‌టీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు రాణిస్తున్నాయి. టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, టీసీఎస్‌, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. హిండాల్కో భారీగా నష్టపోయింది.

చదవండి: లాభాలు సరే? మరి నష్టపోయినోళ్ల సంగతేంటి?

మరిన్ని వార్తలు