Stock Market: లాభంతో మొదలై స్వల్ఫ నష్టలాభాల ఊగిసలాటతో..

21 Oct, 2021 09:51 IST|Sakshi

స్టాక్‌ మార్కెట్‌.. గురువారం ఉదయం లాభాలతో మొదలై.. స్వల్ఫ నష్టాలు, ఆపై స్వల్ఫ లాభల దిశగా ట్రేడ్‌ అవుతోంది. వరుస రికార్డులను నమోదుచేసిన దేశీ సూచీలకు మంగళవారం రోజున బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. బుధవారం కూడా ఇదే ట్రెండ్‌ మార్కెట్‌లో కొనసాగింది. అయితే గురువారం ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు మరోసారి సరికొత్త గరిష్టాలను టచ్‌ చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 69 పాయింట్లు లాభపడి 61,329 పాయింట్ల వద్ద ట్రేడయ్యింది. నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 18,297 వద్దకు చేరుకుంది. కానీ, కాసేపటికే సెన్సెక్స్‌, నిఫ్టీలు స్వల్ఫ నష్టాలను చవిచూశాయి. ఆ వెంటనే స్వల్ఫంగా లాభపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 61,271.07 , నిఫ్టీ 18,282.00 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.


నిఫ్టీ ఎనర్జీ బెస్ట్‌ సెక్టార్‌గా, నిఫ్టీ సెక్టార్‌ వరస్ట్‌ సెక్టార్‌లో కొనసాగుతున్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌ మీద మార్కెట్‌ ఫోకస్‌ నడుస్తోంది.  ఓఎన్‌జీసీ భారీగా లాభపడగా, ఐవోసీ, టాటా మోటర్స్‌, బీపీసీఎల్‌, టాటా కన్జూమర్‌ ఉత్పత్తులు లాభపడ్డాయి.  హెచ్‌సీఎల్‌ టెక్‌ భారీగా నష్టపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ తరపున సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, మారుతీ, ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌ లాభపడగా.. ఏషియన్‌ పెయింట్‌, టైటాన్‌, బజాజ్‌ ఆటో, టీసీఎస్‌, టెక్‌ఎం, భారతీఎయిర్‌టెల్‌ నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

చదవండి: మార్కెట్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ హవా

మరిన్ని వార్తలు