స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

9 Sep, 2021 16:22 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మద్యాహ్నం తర్వాత రియాల్టీ, ఫార్మా షేర్ల అమ్మకాల ఒత్తిడి, ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 55 పాయింట్లు(0.09 శాతం) పెరిగి 58,305.07 వద్ద ఉంటే, నిఫ్టీ 16 పాయింట్లు (0.09 శాతం) లాభంతో 17,369.25 వద్ద స్థిరపడింది. నేడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 73.57 వద్ద ఉంది.

జెఎస్ డబ్ల్యు ఎనర్జీ, వొడాఫోన్ ఐడియా, టాటా మోటార్స్, నెస్లె, భారతి ఎయిర్ టెల్, ఓఎన్ జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఫ్యూచర్ రిటైల్ షేర్లు నేడు రాణిస్తే.. మరోవైపు ఎస్‌బీఐ, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అల్ట్రా టెక్ సిమెంట్, బజాజ్ ఆటో, దీవిస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్, వెల్ స్పన్ ఇండియా షేర్లు డీలాపడ్డాయి.

మరిన్ని వార్తలు