-

Stock Market News Today: నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు!

6 Jul, 2022 10:45 IST|Sakshi

జాతీయ, అంతర్జాతీయ అంశాల ప్రభావం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లపై పడింది. దీంతో బుధవారం స్టాక్‌ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాలను వెంటాడుతున్న మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణం ఆందోళనలు,పలు దేశాల రుణ రేట్ల పెంపుతో ప్రపంచ వృద్ధిబాటలోంచి క్షీణతలోకి మారే అవకాశాలు కనిపిస్తున్నాయని పలు నివేదికలు వెలుగులోకి రావడం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు ఊగిసలాటకు కారణమయ్యాయి. 

వెరసీ బుధవారం మార్కెట్లు ప్రారంభంలో సెన్సెక్స్‌ 351 పాయింట్ల లాభంతో 53,486 వద్ద ట్రేడ్‌ అవ్వగా.. నిఫ్టీ 88 పాయింట్లు లాభపడి 15,898 వద్ద కొనసాగించింది. కానీ కొద్ది సేపటికే మార్కెట్లు నష్టాల్లో జారుకున్నాయి. దీంతో ఉదయం 10.36గంటలకు సెన్సెక్స్‌ 288 పాయింట్ల నష్టపోయి 53423 వద్ద..నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 15883 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. 

ఇక బజాజ్‌ ఫైనాన్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఎథేర్‌ మోటార్స్‌,హెచ్‌యూఎల్‌, ఎంఅండ్‌ ఎం, బ్రిటానియా, హీరో మోటా కార్ప్‌, మారుతి సుజికీ, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఓఎన్‌జీసీ, హిందాల్కో, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, ఎన్టీపీసీ, జేఎస్‌డ్ల్యూ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టాల‍్లో కొనసాగుతున్నాయి.    
 

మరిన్ని వార్తలు