బుల్ జోష్: దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

23 Jan, 2023 09:57 IST|Sakshi

ఈ వారంలో జరిగే నాలుగు రోజుల  ట్రేడింగ్‌లో బడ్జెట్‌పై అంచనాలు, కార్పొరేట్‌ క్యూ3 ఫలితాలు, నెలవారీ డెరివేటివ్స్‌ ఎక్స్‌పైరీ, ప్రపంచ పరిణామాలతో ఇన్వెస్టర్ల అప్రమత్తతో ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉండొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ తరుణంలో సోమవారం ఉదయం 9.46 నిమిషాల సమయానికి సెన్సెక్స్‌ 413 పాయింట్ల లాభంతో  61035 వద్ద ట్రేడ్‌ అవుతుండగా నిఫ్టీ 110 పాయింట్లు లాభ పడి 18138 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. 

ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌,ఎన్‌టీపీసీ,జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌,అదానీ పోర్ట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, గ‍్రసిం,టాటా స్టీల్‌, ఏసియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా..హీరోమోటో కార్ప్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, యూపీఎల్‌, టాటా మోటార్స్‌, హిందాల్కో, కొటక్‌ మహీంద్రా, ఎథేర్‌ మోటార్స్‌,ఎస్‌బీఐ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. 

అంతకు ముందు ఈ రోజు ఉదయం సెన్సెక్స్‌ 288 పాయింట్లు లాభంతో 60909 వద్ద, నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 18106 ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇక 1620 షేర్లు అడ్వాన్స్‌గా ట్రేడ్‌ అవుతుండగా.. 616 షేర్లు నష్టాల్లో నష‍్టాలతో ఆరంభించాయి. 143 షేర్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. 

మరిన్ని వార్తలు