లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

2 Aug, 2021 16:20 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలకు తోడు విదేశీ మదుపర్ల అమ్మకాల కొనసాగుతుండటంతో లాభాల వైపు పయనించాయి. అయితే, మద్యాహ్నం 2 తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిన తర్వాత ‎ఆటో, రియాల్టీ, ఆయిల్ & గ్యాస్ స్టాక్స్ సూచీలకు మద్దతుగా ఉండటంతో మార్కెట్ ముగిసే సమయంలో లాభాలవైపు పయనించాయి. ముగింపులో, సెన్సెక్స్ 363.79 పాయింట్లు (0.69 శాతం) పెరిగి 52,950.63 వద్ద, నిఫ్టీ 122.20 పాయింట్లు (0.78 శాతం) పెరిగి 15,885.20 వద్ద ఉన్నాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.36 వద్ద ఉంది. 

నేడు సుమారు 2007 షేర్లు అడ్వాన్స్ చేయబడ్డాయి, 1071 షేర్లు క్షీణించాయి, 136 షేర్లు మారలేదు. శ్రీ సీమెంట్స్, టైటాన్ కంపెనీ, బీపీసీఎల్, గ్రాసీమ్ ఇండస్ట్రీస్, ఐచర్ మోటార్స్ షేర్లు టాప్ నిఫ్టీ గెయినర్లుగా ఉన్నాయి. యుపీఎల్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎన్ టీపీసీ షేర్లు అధికంగా నష్టపోయాయి.

మరిన్ని వార్తలు