భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

22 Jul, 2021 16:45 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట‍్ల సానుకూల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలలో ముగిశాయి. నిన్న అంటువ్యాదుల చికిత్స నిపుణుడు ఆంటోని ఫౌచి వ్యాక్సిన్ల పనితీరు అద్భుతంగా ఉందని చెప్పారు. దీంతో అమెరికాలో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. అలాగే దేశీయ లోహ, బ్యాంకింగ్, ఆర్ధిక, రియాల్టీ, టెక్ రంగాల షేర్ల కొనుగోళ్లతో మార్కెట్లు పరుగులు పెట్టాయి. చివరకు సెన్సెక్స్ 638.70 పాయింట్లు (1.22%) పెరిగి 52,837.21 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 191.90 పాయింట్లు (1.23%) పెరిగి 15,824 వద్ద ముగిసింది. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.46 వద్ద నిలిచింది. ‎జెఎస్ డబ్ల్యు స్టీల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్ టెల్ మరియు బజాజ్ ఫిన్ సర్వ్ నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1.5 శాతం పెరిగాయి.‎

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు