బుల్‌ జోరు.. మదుపర్లకు లాభాల పంట!

24 Aug, 2021 16:09 IST|Sakshi

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ఈ రోజు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. ‎మెటల్, ఫార్మా, బ్యాంక్స్, పవర్ స్టాక్స్ అండ అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 18.5 శాతంగా ఉండనుందన్న ఎస్‌బీఐ అంచనాలు మార్కెట్‌ సెంటిమెంటును బలోపేతం చేశాయి. దీంతో స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 403.19 పాయింట్లు (0.73%) పెరిగి 55,958.98 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 128.10 పాయింట్లు (0.78%) లాభపడి 16,624.60 వద్ద ముగిసింది.

బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్ నేటి మార్కెట్లో లాభపడితే.. బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, నెస్లే షేర్లు నష్టపోయాయి.‎ ‎బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా లాభపడ్డాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు మినహా ఇతర అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి.(చదవండి:  పసి‘ఢి’ పోరుకు.. మేం సిద్ధం..)

>
మరిన్ని వార్తలు