బుల్ జోరు..భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

2 Sep, 2021 16:20 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి తమ జోరును కొనసాగించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు ‎ఐటీ, ఎఫ్ఎంసిజి, సీమెంట్ షేర్ల అండతో బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. చివరకు, సెన్సెక్స్ 514.33 పాయింట్లు (0.90%) పెరిగి 57852.54 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 157.90 పాయింట్లు (0.92%) లాభపడి 17234.20 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.05 వద్ద నిలిచింది.‎

‎శ్రీ సిమెంట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, సీప్లా, టిసీఎస్, హెచ్‌యుఎల్ షేర్లు నిఫ్టీలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఎం అండ్ ఎం, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఓఎన్ జీసీ, దివిస్ ల్యాబ్స్ టాప్ లూజర్లలో ఉన్నాయి.‎ ‎ఆటో, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ మినహా అన్ని ఇతర ఐటీ, ఫార్మా సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరగడంతో లాభాలతో ముగిశాయి.(చదవండి: భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు ఖాయం!)

మరిన్ని వార్తలు