60 వేల మార్క్‌ను దాటేసిన సెన్సెక్స్

24 Sep, 2021 16:11 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో మరో రికార్డు చోటు చేసుకుంది. నేడు(సెప్టెంబర్ 24) సెన్సెక్స్‌ ఆరంభంలోనే 60 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఇక నిఫ్టీ 18,000 కీలక మైలురాయి దిశగా పయనిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలు, దేశీయంగా పలు సానుకూల పరిమాణాల నేపథ్యంలో మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 3న 50 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్ కేవలం 7 నెలల్లో 60 వేలకు చేరుకొని అంతర్జాతీయ మార్కెట్‌లతో పోటీ పడుతున్నాయి. చివరకు, సెన్సెక్స్ 163.11 పాయింట్లు (0.27%) లాభపడి 60,048.47 వద్ద ఉంటే, నిఫ్టీ 30.20 పాయింట్లు (0.17%) లాభపడి 17,853.20 వద్ద ముగిసింది. 

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ నేడు రూ.73.75 వద్ద ట్రేడవుతోంది. ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, సన్‌ ఫార్మా షేర్లు రాణిస్తే.. టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, టైటన్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫినాన్స్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఐటీ, ఆటో, రియాల్టీ మినహా అన్ని ఇతర సెక్టార్ సూచీలు మెటల్, ఎఫ్ఎంసీజీ, పిఎస్‌యు బ్యాంక్, పవర్ సూచీలు 1-2 శాతం తగ్గాయి.(చదవండి: ఔరా.. అద్దాలలో ఈ స్మార్ట్‌ అద్దాలు వేరయా!)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు