లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్!

8 Nov, 2021 15:56 IST|Sakshi

ముంబై: స్టాక్​ మార్కెట్లు నష్టాల నుంచి తేరుకుని లాభాలబాట పట్టాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్​ను లాభాలతో ప్రారంభించిన కాసేపటికే అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పరిస్థితులతో సూచీలు డీలా పడ్డాయి. ఆ తర్వాత పవర్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, పీఎస్‌యు బ్యాంకింగ్‌ స్టాక్స్ మద్దతుతో నేడు సూచీలు లాభాల్లో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 477.99 పాయింట్లు (0.80%) పెరిగి 60,545.61 వద్ద ఉంటే, నిఫ్టీ 151.70 పాయింట్లు(0.85%) పెరిగి 18,068.50 వద్ద ముగిసింది. నేడు సుమారు 1707 షేర్ల విలువ పెరిగితే, 1475 షేర్ల విలువ క్షీణించింది, 169 షేర్ల విలువ మారలేదు.

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.05 వద్ద ఉంది. ఐఓసీ, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా షేర్లు ఎక్కువ లాభం పొందితే.. ఇండస్​బ్యాంకు, దివిస్ ల్యాబ్స్, ఎంఅండ్ఎం, ఎస్బిఐ, మారుతి సుజుకి షేర్లు ఎక్కువగా నష్టాపోయాయి. ఫార్మా & బ్యాంక్ మినహా అన్ని ఇతర సెక్టోరల్ సూచీలు క్యాపిటల్ గూడ్స్, పీఎస్‌యు బ్యాంక్, ఐటీ, మెటల్, పవర్, ఆయిల్, రియాల్టీ సూచీలు 1-2 శాతం లాభాల్లో ముగిశాయి.

(చదవండి: స్పైస్‌జెట్‌ బంపర్‌ ఆఫర్‌, డబ్బులు లేవా.. తర్వాతే ఇవ్వండి!)

మరిన్ని వార్తలు