Stock Market: జీవనకాల గరిష్ఠానికి సూచీలు

13 Oct, 2021 16:13 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ గరిష్ఠాలకు దూసుకెళ్లాయి. దీంతో నేడు సూచీలు జీవనకాల గరిష్ఠాల వద్ద ముగిశాయి. ఆటో, ఐటీ, మెటల్ మద్దతుతో రికార్డు స్థాయిలో ముగిశాయి. ఈ రోజు ర్యాలీలో టాటా మోటార్స్‌ కీలక పాత్ర పోషించింది. చివరలో, సెన్సెక్స్ 452.74 పాయింట్లు (0.75%) లాభపడి 60,737.05 వద్ద ఉంటే, నిఫ్టీ 169.80 పాయింట్లు (0.94%) పెరిగి 18,161.80 వద్ద ముగిసింది. సుమారు 1602 షేర్లు లాభపడితే, 1504 షేర్లు క్షీణించాయి, 118 షేర్లు విలవ మారలేదు. 

నిఫ్టీలో టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, పవర్ గ్రిడ్ కార్ప్, ఐటీసీ షేర్లు ఎక్కువగా లాభాలను పొందాయి. మారుతి సుజుకి, ఒఎన్‌జిసి, కోల్ ఇండియా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, హెచ్యుఎల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఆటో రంగాలలో ఇండెక్స్ 3.5 శాతం ఇంధనం, ఇన్ ఫ్రా, ఐటీ, మెటల్, పవర్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి.(చదవండి: రూ.15 లక్షలలో రాబోతున్న టాప్ 4 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!)

మరిన్ని వార్తలు