నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

9 Jul, 2021 16:17 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు 11 గంటలు సమయంలో తిరిగి పుంజుకున్నాయి. ఇక ఆ తర్వాత నుంచి సూచీలు రోజులో ఏ దశలోనూ కోలుకోలేక పోయాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు పలు దేశాల్లో కొవిడ్‌-19 డెల్టా వేరియంట్‌ కేసులు పెరగడంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 182.75 పాయింట్లు(0.35%) క్షీణించి 52,386.19 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 38.10 పాయింట్లు(0.24%) క్షీణించి 15,689.80 వద్ద ముగిసింది. ఇక నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.60 వద్ద నిలిచింది.

నేడు మార్కెట్లో బజాజ్ ఆటో, టిసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్‌ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్‌ షేర్లు నష్ట పోతే.. టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, భారతి ఎయిర్ టెల్, జెఎస్ డబ్ల్యు స్టీల్, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, మారుతీ షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.‎
 

మరిన్ని వార్తలు