నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్!

20 Jul, 2021 16:39 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్ల ఒత్తిడి కారణంగా క్రమ క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.  స్థిరాస్తి, లోహ, విద్యుత్తు, టెలికం, బ్యాంకింగ్‌ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. షాంఘై, హాంగ్ కాంగ్, సియోల్, టోక్యోలోని బోర్సెస్ కూడా నష్టాలతో ముగిశాయి. చివరకు సెన్సెక్స్  354.89 పాయింట్లు (0.68 శాతం) నష్టపోయి 52,198.51 వద్ద స్థిరపడితే, నిఫ్టీ కూడా 120.30 పాయింట్లు (0.76 శాతం) నష్టపోయి 15,632.10 వద్ద ముగిసింది. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.59 వద్ద నిలిచింది. అంతర్జాతీయ చమురు బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ కు 0.35 శాతం పెరిగి 68.86 డాలర్లకు చేరుకుంది. నేడు అల్ట్రాటెక్ సీమెంట్, బజాజ్ ఆటో, హెచ్ యుఎల్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభపడితే.. హిందాల్కో, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్ టీపీసీ, భారతి ఎయిర్ టెల్ షేర్లు నష్టపోయాయి.

మరిన్ని వార్తలు