నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్!

1 Sep, 2021 16:06 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రికార్డు స్థాయిలను తాకిన తర్వాత క్రమ క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ‎అనుకూలమైన జీడీపీ వృద్ది రేటు సానుకూలంగా ఉండటంతో సూచీలు రికార్డు స్థాయి తాకాయి. చివరకు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడటంతో ఏ దశలోనూ సూచీలు కొలుకునే విధంగా కనిపించలేదు. చివరకు, సెన్సెక్స్ 214.18 పాయింట్లు (0.37%) క్షీణించి 57338.21 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 55.90 పాయింట్లు (0.33%) పడిపోయి 17076.30 వద్ద ముగిసింది. సుమారు 1461 షేర్లు అడ్వాన్స్ చేయబడ్డాయి, 1637 షేర్లు క్షీణించాయి, 150 షేర్లు మారలేదు.‎ నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.09 వద్ద నిలిచింది.‎

‎ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, ఎస్ బిఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే లు నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఎం అండ్ ఎం, సిప్లా, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ లూజర్లలో ఉన్నాయి.‎ లోహా, ఐటీ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా పడిపోతే, మూలధన వస్తువులు, విద్యుత్, రియాల్టీ సూచీలు 1-5 శాతం పెరిగాయి.(చదవండి: దేశంలో వీపీఎన్ సర్విస్ బ్యాన్‌ కానుందా..?)

మరిన్ని వార్తలు