Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

28 Sep, 2021 16:15 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం 60,285.89 పాయింట్ల వద్ద స్తబ్ధుగా ప్రారంభమెన సెన్సెక్స్‌ నెమ్మ నెమ్మదిగా నష్టాల్లోకి జారుకుంది. సెన్సెక్స్ ఒకానొక దశలో 1000 పాయింట్లకు పైగా నష్ట పోయింది. కనిష్ఠల వద్ద కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గు చూపడటంతో మార్కెట్ కొంత ఊపిరి పీల్చుకుంది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ముగింపులో, సెన్సెక్స్ 410.28 పాయింట్లు (0.68%) క్షీణించి 59,667.60 వద్ద ఉంటే, నిఫ్టీ 106.50 పాయింట్లు (0.60%) క్షీణించి 17,748.60 వద్ద ముగిసింది. సుమారు 1463 షేర్లు అడ్వాన్స్ చేయబడ్డాయి, 1715 షేర్లు క్షీణించాయి, 164 షేర్లు మారలేదు.

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ నేడు రూ.74.06 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీలో భారతి ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, దివిస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు ఎక్కువ నష్టపోతే.. పవర్ గ్రిడ్ కార్ప్, కోల్ ఇండియా, ఎన్ టిపిసి, ఐఓసీ, బీపీసీఎల్, సన్‌ఫార్మా, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, టైటన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, రిలయన్స్ షేర్లు రాణించాయి.(చదవండి: ఈవీ రంగంలో ఫోర్డ్ మోటార్స్ భారీగా పెట్టుబడులు)

మరిన్ని వార్తలు