లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

23 Aug, 2021 16:17 IST|Sakshi

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. 11:00 గంటల సమయంలో ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ సమయంలో ఐటి స్టాక్స్ నుంచి అండ లభించడంతో సూచీలు మళ్లీ తిరిగి పుంజుకున్నాయి. చివరకు సెన్సెక్స్‌ 226.47 పాయింట్లు (0.41%) పెరిగి 5555.79 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 46 పాయింట్లు (0.28%) పెరిగి 16496.50 వద్ద ముగిసింది. సుమారు 745 షేర్లు లాభపడితే, 2438 షేర్లు క్షీణించాయి, 135 షేర్లు విలువ మారలేదు. ఇక ఈ రోజు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.19 వద్ద నిలిచింది.

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌ నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో షేర్లు టాప్ లూజర్లలో ఉన్నాయి. ఐటి రంగాలలో నిఫ్టీ సూచీ ఒక్కొక్కటి 1.7 శాతం లాభపడగా మెటల్, ఆటో, పీఎస్ యు బ్యాంక్ సూచీలు 0.5-1.5 శాతం నష్టపోయాయి.

(చదవండి: ఆకాశం హద్దులు దాటించిన రియల్ హీరో.. ఇప్పుడెక్కడ?)

మరిన్ని వార్తలు