మార్కెట్లపై బేర్​ పంజా.. 60 వేల దిగువకు సెన్సెక్స్

30 Sep, 2021 16:26 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మూడో రోజు వరుసగా నష్టాలతో ముగిశాయి. మార్కెట్లపై బేర్​ పంజా విసరడంతో సెన్సెక్స్ 60 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్ట్‌ గడువు ముగిసిన నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. అందుకే మధ్యాహ్నం తర్వాత సూచీలు పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. చివరకు, బీఎస్ఈ సెన్సెక్స్ 286.91 పాయింట్ల (0.48%) నష్టంతో 59,126.36 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 93.10 పాయింట్లు (0.53%) కోల్పోయి 17,618 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 74.27గా ఉంది.

నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్ షేర్లు ఎక్కువగా నష్టపొతే.. బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. రంగాల వారీగా చూసినప్పుడు పవర్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియల్టీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా.. మెటల్ షేర్లు, ఆటో, బ్యాంక్‌, ఐటీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.(చదవండి: రుధిరం, టాల్కం పౌడర్‌, పోస్కో.. నావల్ల కాదు)

మరిన్ని వార్తలు