భారీగా పడిపోయిన స్టాక్ మార్కెట్లు!

22 Nov, 2021 16:09 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలపై బేర్‌ పట్టు బిగించింది. ఈ వారం కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం మార్కెట్‌ ప్రారంభమైనప్పటి నుంచే దేశీ సూచీలు వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలైంది. సూచీలు ఏ దశలోనూ కొలుకొనలేదు. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో పాటు దేశీయంగా ఫలితాల సీజన్‌ ముగియడంతో మార్కెట్లకు మద్దతు లభించడం లేదు. దీనికితోడు ద్రవ్యోల్బణ భయాలతో అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు సూచీలను మరింత దెబ్బతీశాయి. దీంతో ఈరోజు స్టాక్ మార్కెట్లకు మరో బ్లాక్‌ మండేగా మిగిలిపోయింది.

చివరకు, సెన్సెక్స్ 1,170.12 పాయింట్లు (1.96%) క్షీణించి 58,465.89 పాయింట్స్ వద్ద ఉంటే, నిఫ్టీ 348.30 పాయింట్లు (1.96%) క్షీణించి 17,416.50 వద్ద ముగిసింది. సుమారు 842 షేర్లు అడ్వాన్స్ అయితే, 2479 షేర్లు క్షీణించాయి, 157 షేర్లు మారలేదు. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.41 వద్ద ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో 04 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఒఎన్ జిసి, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్  భారీగా నష్టపోతే.. భారతి ఎయిర్ టెల్, ఏషియన్ పెయింట్స్, జెఎస్ డబ్ల్యు స్టీల్, పవర్ గ్రిడ్, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు నేడు అధికంగా లాభాలను పొందాయి. అన్ని  రియాల్టీ, హెల్త్ కేర్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్‌యు బ్యాంక్ సెక్టోరల్ సూచీలు 2-4 శాతం తగ్గడంతో మార్కెట్లు భారీగా నష్టాల్లో ముగిశాయి.

(చదవండి: Swiggy: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన స్విగ్గీ..!)

మరిన్ని వార్తలు