జోరుగా ప్రారంభమైన స్టాక్​ మార్కెట్

13 Jul, 2021 09:49 IST|Sakshi

Stock Market Updates ముంబై: ఇవాళ ముంబై స్టాక్​ మార్కెట్​ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్​ 52,694 పాయింట్లతో మొదలైంది. నిన్న సాయంత్రం 52,372 పాయింట్ల వద్ద మార్కెట్​ క్లోజ్​ అయ్యింది. కాగా, ఈ రోజు 322 పాయింట్లు లాభపడింది. ఉదయం 9:30 గంటలకు 52,608 పాయింట్ల వద్ద నమోదు అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ నిన్న 15,692 పాయింట్ల వద్ద క్లోజ్​ అవగా ఈ రోజు మార్కెట్​ ప్రారంభం కాగానే 101 పాయింట్లు లాభ పడింది. ఉదయం 9:30 గంటలకు 15,794 పాయింట్ల వద్ద కదలాడుతోంది. 

ఐసీఐసీఐ బ్యాంక్​, బజాజ్​ ఫైనాన్స్​, మహీంద్రా అండ్​ మహీంద్రా, ఎన్​టీపీసీ, మారుతి సుజూకి ఇండియా, స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, హెచ్​డీఎఫ్​సీ షేర్లు లాభాలు పొందాయి. టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ ఐటీ కంపెనీలు నష్టపోయాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు