సాక్షి మనీ మంత్ర: స్వల్పంగా పెరిగిన మార్కెట్‌ సూచీలు

13 Feb, 2024 09:23 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంగళవారం స్వల్పంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 26 పాయింట్లు పుంజుకుని 21,654కు చేరింది. సెన్సెక్స్‌ 203 పాయింట్లు లాభపడి 71,272వద్ద ట్రేడవుతోంది.

ఎఫ్‌ఐఐలు ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.126.6 కోట్లు, డీఐఐలు రూ.1711.75 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన ఆహార ద్రవ్యోల్బణం జనవరిలో 3 నెలల కనిష్ట స్థాయిలో 5.1 శాతానికి తగ్గింది. కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం దీనికి కారణమని అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. 

మార్కెట్లు ఈ మధ్యకాలంలో భారీగా ఒడిదొడుకులకు లోనవుతోందని తెలుస్తుంది. అయితే ఇలాంటి సమయంలో ​కొత్తగా మార్కెట్‌లోకి వచ్చినవారు నష్టభయాన్ని తట్టుకోలేక లాస్‌బుక్‌ చేస్తుంటారు. కానీ స్టాక్ ఫ​ంటమెంటల్స్‌పై పూర్తి అవగాహన ఉండి బిజినెస్‌ మోడల్‌పై పట్టు ఉంటే దీర్ఘకాలికంగా మంచి లాభాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

whatsapp channel

మరిన్ని వార్తలు