లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

13 Apr, 2021 18:11 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనా సూచీల్లో మధ్యాహ్నం వరకూ ఊగిసలాట ధోరణి కనిపించింది. కొవిడ్‌, లాక్‌డౌన్ భయాలతో సోమవారం భారీ నష్టాలను చవి చూసిన మార్కెట్లు మంగళవారం ఊపిరి పీల్చుకున్నాయి. భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్కెట్‌ను మరింత సానుకూలంగా కదిలేలా చేసింది. ఇప్పటికే వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు మన దేశంలో కూడా అనుమతులు ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలన్న నిర్ణయంతో సూచీలు లాభాల బాట పట్టాయి. చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 660 పాయింట్లు లాభపడి, 48,544 వద్ద ముగియగా, నిఫ్టీ 194 పాయింట్ల లాభంతో 14,504 వద్ద స్థిరపడింది. 

చదవండి: సూయజ్‌ లో చిక్కుకున్న రాకాసి నౌకకు తప్పని కష్టాలు

మరిన్ని వార్తలు