స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

16 Apr, 2021 16:18 IST|Sakshi

న్యూఢిల్లీ: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీలు తర్వాత ఊగిసలాట ఆడుతూ చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. 48,935 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్ కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో 49,089 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకి చివరి సమయంలో 28 పాయింట్ల స్వల్ప లాభంతో 48,832 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 36 పాయింట్లు పైకి ఎగబాకి 14,617 వద్ద స్థిరపడింది.

డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.35 వద్ద స్థిరపడింది. అమెరికా, ఐరోపాతో పాటు ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. నిన్న వెలువడిన విప్రో నాలుగో త్రైమాసికం ఫలితాలు అంచనాలు మించడంతో నేడు ఆ కంపెనీ షేర్లు ఓ దశలో ఏకంగా 10 శాతం మేర లాభపడ్డాయి. హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సిప్లా, నెస్లే ఇండియా, సన్‌ ఫార్మా షేర్లు లాభాల్లో పయనించగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

చదవండి: 

భారత్‌లో టెస్లా కార్ల తయారీకి మంచి అవకాశం: గడ్కరీ

మరిన్ని వార్తలు