ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్!

16 Jul, 2021 16:22 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని ఫ్లాట్‌గా ముగించాయి. ఉదయం స్పల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఒక్కసారిగా కిందకు పడిపోయాయి. మళ్లీ తిరిగి పుంజుకొని అతి కొద్ది నష్టాలతో సూచీలు ముగిశాయి. అంతర్జాతీయంగానూ ప్రతికూల సంకేతాలు నేపథ్యంలో సూచీలు అప్రమత్తంగా కదలాడాయి. చివరకు సెన్సెక్స్ 19 పాయింట్లు(0.04) శాతం క్షీణించి 53,140.06 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 0.80 పాయింట్లు నష్టపోయి 15,923 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.56 వద్ద నిలిచింది. ఫార్మా, రియాల్టీ, మెటల్ సూచీలు ఒక్కొక్క శాతానికి పైగా పెరగగా నిఫ్టీ ఐటీ ఒక శాతానికి పైగా పడిపోయింది. ‎

నేడు మార్కెట్లో భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌, ఐటీసీ, సన్‌ఫార్మా షేర్లు లాభపడగా... హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలను చవిచూశాయి.

మరిన్ని వార్తలు