మార్కెట్: నూతన గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్

15 Sep, 2021 16:11 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. గత కొన్ని రోజులుగా నెమ్మదించిన సూచీలు నేడు ఊపు అందుకున్నాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు టెలికాం, ఆటో రంగాలకు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ప్రకటించడంతో ఆయా రంగాల షేర్లు దూసుకెళ్లాయి. దీంతో సూచిలు జీవనకాల గరిష్ఠాలను తాకాయి. చివరకు, సెన్సెక్స్ 476 పాయింట్లు (0.82 శాతం) పెరిగి 58,723.20 వద్ద స్థిరపడితే,  నిఫ్టీ 139 పాయింట్లు (0.80 శాతం) లాభపడి 17,519.45 వద్ద ముగిసింది. నేడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 73.43 వద్ద ఉంది.

నేడు ఎన్‌టీపీసీ, టైటన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌ ఇన్ఫోసిస్‌ షేర్లు రాణిస్తే.. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్ బ్యాంక్‌, ఏషియన్ పెయింట్స్‌, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. నేడు దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనించాయి.
 

మరిన్ని వార్తలు