కొత్త ఏడాదిలో బుల్ జోరు.. 60 వేల మార్క్‌ను దాటేసిన సెన్సెక్స్!

5 Jan, 2022 16:13 IST|Sakshi

ముంబై: ఈ కొత్త ఏడాదిలో బుల్ జోరు కొనసాగుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. దీంతో సెన్సెక్స్ మార్కెట్లో కీలక మైలురాయి 60 వేల మార్క్‌ను దాటేసింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత ఒక్కసారిగా పడిపోయిన తిరిగి పుంజుకొని లాభాల్లో ముగిశాయి. ఒమిక్రాన్‌ వైరస్‌ వల్ల ఒక్కో రాష్ట్రంలో క్రమంగా కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తిగా ఉండటంతో పాటు ఆటో, బ్యాంక్, మెటల్, రియాల్టీ షేర్ల అండతో సూచీలు లాభాల్లో ముగిశాయి. 

చివరకు, సెన్సెక్స్ 367.22 పాయింట్లు(0.61%) పెరిగి 60,223.15 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 120 పాయింట్లు (0.67%) పెరిగి 17,925.30 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.35 వద్ద ఉంది. నిఫ్టీలో బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జెఎస్ డబ్ల్యు స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేర్లు టాప్ నిఫ్టీ గెయినర్లలో ఉన్నాయి. నష్టపోయిన వాటిలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, దివిస్ ల్యాబ్స్, విప్రో ఉన్నాయి. ఐటీ మినహా, ఫార్మా పవర్ అన్ని ఇతర సెక్టోరల్ సూచీలు 1-2 శాతం లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.36 శాతం పెరిగితే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ గా ముగిసింది.

(చదవండి: Ola S1 Pro Real Range Test: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ ఇంతేనా..?)

మరిన్ని వార్తలు