స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

19 May, 2021 10:09 IST|Sakshi

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 సమయానికి సెన్సెక్స్‌ 113.20 పాయింట్లు నష్టపోయి 50080.13 వద్ద, నిఫ్టీ 32.90 పాయింట్లు తగ్గి 15075.20 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక యూఎస్‌ డాలరుతో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి 73.04 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  

ఇక హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్జీసీ, కొటక్‌ మహీంద్రా బ్యాంకు టాటా మోటార్స్‌ షేర్లు నష్టాలు చవిచూడగా, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.

మరిన్ని వార్తలు