ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు

20 May, 2021 09:28 IST|Sakshi

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 50 వేల పాయింట్ల దిగువన, నిఫ్టీ 14,985 పాయింట్లతో ఉన్నాయి. ముందుగా లాభాల్లో ప్రారంభమైన సూచీలు సెన్సెక్స్‌ 23, నిఫ్టీ 33 పాయింట్లు డౌన్‌ కావడంతో మార్కెట్లు మెల్లగా నష్టాల్లోకి జారకుంటున్నాయి. ఇక టైటాన్‌ కంపెనీ లిమిటెడ్‌, ఎల్‌ అండ్‌ టీ, ఐసీసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల బాటలో పయనిస్తుండగా,. మరోవైపు.. యాక్సిక్‌ బ్యాంకు, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ నష్టాల బాట పట్టాయి. డాలర్‌ మారకంతో పోలిస్తే రూపాయి విలువ 73.16 వద్ద ట్రేడ్‌​ అవుతోంది.

మెటల్‌, ఎనర్జీ రంగ సంస్థలు నష్టాల బాట పట్టగా.... డీఏపీపై సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఏకంగా 140 శాతం పెంచిన నేపథ్యంలో ఫర్టిలైజర్‌ రంగ స్టాక్స్‌ పుంజుకుంటున్నాయి.

చదవండి: గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ

మరిన్ని వార్తలు