Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

26 May, 2021 09:23 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 262 పాయింట్ల మేర పెరిగి 50899 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు పెరిగి 15257 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక నిఫ్టీ బ్యాంకు సూచీ 34757, మిడ్‌క్యాప్‌ సూచీ 25661 పాయింట్ల వద్ద ఉంది. బీపీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంకు, ఏసియన్‌ పెయింట్స్‌, గ్రాసిం, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి సూచీలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ ఇంట్రాడే గరిష్ఠాలకు చేరుకున్నాయి. చివరకు సెన్సెక్స్‌ 379 పాయింట్లు లాభపడి 51,017 వద్ద ముగిస్తే, నిఫ్టీ 93 పాయింట్లు పైకిచేరి 15,301 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.72గా ఉంది. దేశీయంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వార్తలు మదుపర్లను ఉత్సాహపరిచాయి.  ఐటీ, ఆర్థికం, స్థిరాస్తి రంగాలు రాణించడంతో సూచీలు ఆగకుండా ముందుకు దూసుకెళ్లాయి. ఈ నేపథ్యంలోనే నేడు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

సెన్సెక్స్‌30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్ ఫినాన్స్‌, ఇన్ఫోసిస్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌మహీంద్రా, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో కొనసాగితే.. పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

మరిన్ని వార్తలు