సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ సూచీలు

27 Feb, 2024 09:35 IST|Sakshi

నిన్న నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం) లాభాలవైపు అడుగులు వేస్తున్నాయి. ఉదయం 9:25 గంటల సమయానికి సెన్సెక్స్ 20.10 పాయింట్ల స్వల్ప లాభంతో 72810.45 వద్ద, నిఫ్టీ 7.75 పాయింట్ల లాభంతో 22129.00 వద్ద ముందుకు సాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా.. అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, HDFC అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్, ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, హావెల్స్ ఇండియా లిమిటెడ్ మొదలైనవి ఉన్నాయి.

ఏషియన్స్ పెయింట్స్, అపోలో హాస్పిటల్, హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, దివీస్ ల్యాబ్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, GMR ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు నష్టాల్లో సాగుతున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

whatsapp channel

మరిన్ని వార్తలు