Stock Market Closing: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

27 May, 2021 09:44 IST|Sakshi

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 51,128, నిఫ్టీ 15324 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అయితే, నిఫ్టీ బ్యాంకు సూచీ మాత్రం 20 పాయింట్ల మేర నష్టపోయి 34664 వద్ద ఉంది. ఇక క్యూ4లో లాభాలు ఆర్జించిన బీపీసీఎల్‌.. అదే విధంగా ఐఓసీ, ఐషర్‌ మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఆటో, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతి షేర్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 97 పాయింట్ల లాభంతో 51,115 వద్ద ముగిస్తే, నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 15,345 పాయింట్లకి చేరుకుంది. మే నెల ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్ల గడవు నేటితో ముగిసిపోవడంతో సూచీల కుదుపులకు కారణమైంది. రోజువారీ కోవిడ్-19 కేసులు తగ్గుతూ ఉండటంతో సూచీలు ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో చివరికి లాభాల్లోనే ముగిశాయి. దీంతో నిఫ్టీ ఆల్‌టైమ్‌ అత్యధికం వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. రూపా అండ్‌ కంపెనీ, జైకార్ప్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, ఆటోమోటీవ్‌ యాక్సెల్స్‌, టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ సంస్థల షేర్లు లాభాల్లో ముగియగా.. వోక్‌హార్డ్‌, డిష్‌టీవీ ఇండియా, కర్ణాటక బ్యాంక్‌, కేఆర్‌బీఎల్‌, శ్రీరామ్‌ సిటి షేర్లు నష్టపోయాయి.

మరిన్ని వార్తలు