Stock Market Closing: నిఫ్టీ సరికొత్త రికార్డు!

28 May, 2021 09:32 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో సెన్సెక్స్‌ 264 పాయింట్లు పెరిగి 51,379, నిఫ్టీ 83 పాయింట్లు ఎగిసి 15421 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంకు సూచీ 35345, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీ 25811 పాయింట్ల వద్ద ఉన్నాయి.  మార్కెట్లు ప్రారంభమైన కాసేపటికే నిఫ్టీ సూచీ ఇంట్రా- డే హై రికార్డు దాటి 15431 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవడం విశేషం. ఇక టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, ఎస్బీఐ, ఐషర్‌ మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ, హిందాల్కో, గ్రాసిం షేర్లు లాభాల బాటలో కొనసాగుతున్నాయి. ఇక సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, నెస్లే ఇండియా, బజాజ్‌ ఆటో నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి సానుకూలంగా మొదలైన ట్రేడింగ్‌ రోజంతా అదే తీరును కొనసాగించింది. ఓ దశలో 128 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ 15,469 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 97 పాయింట్ల లాభంతో 15,435 వద్ద ముగిసింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్లో జోష్ కనిపించింది. దీంతో సెన్సెక్స్‌ కూడా 307 పాయింట్లు లాభపడి 51,422 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.47 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, డాక్టర్ రెడ్డీస్‌, పవర్‌ గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌ షేర్లు నష్టాలు చవిచూస్తే.. రిలయన్స్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ షేర్లు లాభాల్లో పయనించాయి.

చదవండి: బ‘బుల్‌’ రిస్క్‌.. !

మరిన్ని వార్తలు