స్టాక్‌మార్కెట్‌లో అస్థిరత

7 Jul, 2021 10:22 IST|Sakshi

ముంబై : స్టాక్‌ మార్కెట్‌లో అస్థిరత నెలకొంది. ఉదయం నుంచే లాభనష్టాల మధ్య సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు ఊగిసలాడుతున్నాయి. బాంబే స్టాక్‌ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్‌ ఫ్లాట్‌గా కొనసాగుతోంది. మరోవైపు నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ స్థిరంగానే ఉంది. బుధవారం ఉదయం సెన్సెక్స్‌ 52,919 పాయింట్ల వద్ద ప్రారంభమై గరిష్టంగా 53,006 పాయింట్లకు చేరుకుంది. ఆ తర్వాత నష్టపోతూ ఉదయం పది గంటల సమయానికి 52,805 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మొత్తంగా ఈ రోజు సెన్సెక్స్‌ 55 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 15,819 పాయింట్ల దగ్గర మొదలై 15,850 పాయింట్లకు చేరకుంది. ఉదయం పదిగంటల సమయంలో మొత్తగా 10 పాయింట్లు నష్టపోయి 15,880 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు ఏషియన్‌ పేయింట్స్‌, టాటాస్టీల్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌ లాభపడగా  మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హిందూస్తాన్‌ లీవర్‌, టైటాన్‌ షేర్లు స్వల్ప నష్టాలను మూటగట్టుకున్నాయి. మరోవైపు క్లెన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, జీ ఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు ఐపీవోకు రానున్నాయి. 
 

>
మరిన్ని వార్తలు