స్టాక్‌ మార్కెట్‌లో ఊగిసలాట.. లాభనష్టాల మధ్య సూచీలు

27 Dec, 2022 10:38 IST|Sakshi

కోవిడ్‌ భయాలతో అమ్మకాల ఒత్తిడికి లోనైన దేశీయ మార్కెట్‌లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ వారం ప్రారంభంతో క్రిస్మస్‌ పండుగ తర్వాత రోజు స్టాక్‌ మార్కెట్లో శాంటాక్లాజ్‌ ర్యాలీతో లాభాలు గడించాయి.  ఆ మరుసటి రోజు అంటే ఇవాళ కోవిడ్‌తో పాటు ఇతర అంతర్జాతీయ అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. 

దీంతో మంగళవారం ఉదయం 10.30గంటల సమయానికి లాభానష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌  26 పాయింట్ల లాభంతో 60593 వద్ద.. నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 18027 వద్ద ట్రేడింగ్‌ కొనసాగుతుంది. 

హిందాల్కో, టాటా స్టీల్‌, జేఎస్‌డ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, టైటాన్‌ కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎం అండ్‌ ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా కాన్స్‌, హెచ్‌యూఎల్‌, బ్రిటానియా, యూపీఎల్‌ షేర్లు నష్టాల్లో పయనమవుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు