కోలుకున్న స్టాక్‌​ మార్కెట్‌.. లాభాలతో ముగింపు

27 Aug, 2021 15:59 IST|Sakshi

ముంబై : పెద్ద కంపెనీలు మెరుగైన ఫలితాలు సాధించకుండా స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ కంపెనీల అండతో స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాలను తప్పించుకుంది. అంతేకాదు మార్కెట్‌ ముగిసే సమయానికి ఇన్వెస్టర్లకు లాభాలను సైతం అందివ్వగలిగింది. ఈ వారం చివరి సెషన్‌ చివరి భాగంలో మార్కెట్‌ ఒక్కసారిగా పుంజుకుంది.

నష్టాల నుంచి లాభాల వైపు
ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 55,862 పాయింట్లో మొదలైంది. కాసేపటికే వరుసగా పాయింట్లు కోల్పోతూ ఒక దశలో 55,675 పాయింట్లను తాకింది. దీంతో ఈ సెషన్‌ నష్టాలతోనే ముగుస్తుందనే ఆందోలన నెలకొనగా ఉదయం 11 గంటల తర్వాత మార్కెట్‌ కోలుకోవడం మొదలైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు పెరుగుతూ ఓ దశలో 56,188 పాయింట్లను టచ్‌ చేసింది. చివరకు మార్కెట్‌ ముగిసే సమయానికి 175 పాయింట్లు లాభపడి 56,126 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మొత్తంగా ఈ రోజు సెన్సెక్స్‌ గరిష్ట, కనిష్ట పాయింట్ల మధ్య తేడా 513 పాయింట్లు ఉండటం గమనార్హం, మరోవైపు నిఫ్టీ సైతం ఆరంభంలో నష్టాల పాలైనా మార్కెట్‌ ముగిసే సమయానికి 68 పాయింట్లు లాభపడి 16,705 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఎల్‌ అండ్‌ టీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, బజాజ్‌ఫిన్‌కార్ప్‌, సన్‌ఫార్మా షేర్లు లాభాలు పొందాయి,
 

చదవండి : కొత్త ఐటీ చట్టాలపై కోర్టుకెక్కిన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌

మరిన్ని వార్తలు