ఊగిసలాట మధ్య స్టాక్‌మార్కెట్లు

25 Jun, 2021 10:28 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కుట్లు శుక్రవారం ఉదయం ఊగిసలాట మధ్య ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం సెన్సెక్స్‌ 52,699.00 వద్ద క‍్లోజ్‌ అవ్వగా ఈ రోజు ఉదయం 52,877.16తో ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా పాయింట్లు కోల్పోయింది.  ఉదయం పదిన్నర గంటలకి 52,677 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇప్పటి వరకు సెన్సెక్స్‌ 21 పాయింట్లు నష్టోయింది. ఎన్‌ఎస్‌సీ నిఫ్టీ 15,789 వద్ద  ట్రేడ్‌ అవుతూ  0.8 పాయింట్లతో నష్టంతో కొనసాగుతోంది.

లాభాలు
ఈ రోజు టాటా స్టీల్, మారుతి సుజుకి ఇండియాతో పాటు ఐటి స్టాక్స్‌ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా లాభాలు పొందయి. సర్వసభ్య సమావేశం వివరాలు వెల్లడైనా రిలయన్స్‌  సూచీలు ప్లాట్‌గా కొనసాగుతున్నాయి. రిలయన్స్‌ విషయంలో ముదుపరులు వేచి చూసే ధోరణిలో ఉన్నారని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు