Multi Bagger Stock : లక్ష పెట్టుబడి.. ఏడాదికల్లా రూ.9.94 లక్షల లాభం

10 Sep, 2021 16:20 IST|Sakshi

ముంబై : షేర్‌ మార్కెట్‌లో అధిక లాభాలను అందించే స్టాక్‌లను పట్టుకోవడం ఓ కళ. కొందిరకే అందులో పట్టు ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందే ఆయా కంపెనీకలు సంబంధించిన పనితీరు, భవిష్యత్తులో రాబోయే మార్పులు, ప్రభుత్వ పాలసీలు తదితర అంశాలను బేరీజు వేసుకుని పెట్టుబడులు పెడతారు. స్వల్ప కాలంలోనే భారీ లాభాలను చూస్తారు. ఇటీవల మల్టీబ్యాగర్‌ స్టాక్‌గా పాపులరైన ఎనేషనల్‌ స్టాండర్డ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌ఐ) స్టాక్స్‌ గురించి కొన్ని వివరాలు.

ఏడాదిలోనే లాభాల పంట
మిడ్‌క్యాప్‌ షేర్‌గా ఎన్‌ఎస్‌ఐ బీఎస్‌ఈ స్టాక​ ఎక్సేంజీలో ట్రేడ్‌ అవుతోంది. గతేడాది సెప్టెంబరు 9న ఎన్‌ఎస్‌ఐ షేర్‌ విలువ కేవలం రూ. 298.60 మాత్రమే. అయితే ఆ రోజు నుంచి వరుసగా షేర్‌ విలువ పెరుగుతూనే పోయింది. ఐదో రోజు నుంచి మొదలైన షేరు విలువలో పెరుగుదల రెండోందల రోజు చేరుకునే సరికే రికార్డు స్థాయిలో 569 శాతం పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబరు 9న షేరు 894 శాతం పెరిగి రూ. 2969.25 దగ్గర ట్రేడవుతోంది. ఉజ్జాయింపుగా గత సెప్టెంబరున లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఎన్‌ఎస్‌ఎల్‌ షేర్లు కొనుగోలు చేసిన వారికి సరిగ్గా ఏడాది తిరిగే సరికి దాని విలువల రూ.9.94 లక్షలకు చేరుకుంది. ఏ లెక్కన చూసినా ఏడాదిలో లక్షకు ఎనిమిది లక్షల లాభం తెచ్చిన మల్టీ బ్యాగర్‌ స్టాక్‌గా నిలిచింది.

52 వారాల్లో ఇదీ పరిస్థితి
2020 సెప్టెంబరు 9న ఎన్‌ఎస్‌ఐ షేరు విలువ రూ. 298.60 ఉండగా ఈ 52 వారాల వ్యవధిలో గరిష్టంగా ఆగస్టు 27న రూ. 3,820లకు చేరుకుంది. ఆగస్టులో ఈ కంపెనీ షేర్లు అమ్ముకున్న వారి మరింత లాభాలను సొంతం చేసుకున్నారు. స్టాక్‌ వ్యాల్యూ జీవిత కాల గరిష్టాలకు చేరుకోవడంతో అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో 2021 సెప్టెంబరు 9న షేర్‌ వాల్యూ రూ.2969గా నమోదు అయ్యింది. ఎన్‌ఎస్‌ఐ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రసిద్ది చెందిన లోదా గ్రూప్‌ సబ్సిడరీ కంపెనీ. 

చదవండి : ఈక్విటీ మార్కెట్ల మద్దతు ఒక్కటే చాలదు

మరిన్ని వార్తలు