StockMarketUpdate: కోలుకున్న మార్కెట్లు, కుప్పకూలిన రూపాయి

5 Dec, 2022 15:50 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  నష్టాల్లో ముగిసాయి. అయితే ఆరంభ  నష్టాలనుంచి భారీగా కోలుకోవడం గమనార్హం.   34 పాయింట్ల స్వల్ప నష్టంతో 62835 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు  లాభపడి  18701 వద్ద స్థిరపడ్డాయి.  హిందాల్కో​, టాటా స్టీల్‌, యూపీఎల్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ  భారీ లాభపడగా,   అపోలో హాస్పిటల్స్‌, టాటా మోటార్స్‌, రిలయన్స్‌, టెక్‌ మహీంద్ర, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌  టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 

అటు డాలరు మారకంలో రూపాయి 58 పైసలు కుప్పకూలి 81.79 వద్ద   ముగిసింది. శుక్రవారం నాటి ముగింపు 81.32 తో పోలిస్తే సోమవారం స్వల్పంగ నష్టపోయిన రూపాయి ఆతరువాత మరింత పతనమైంది. 

మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టారు. డాలరు బలహీనంగా ఉన్నప్పటికీ  అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలలో 1.4 శాతం పెరుగుదల కారణంగా  రూపాయి సోమవారం కుప్పకూలింది. 

మరిన్ని వార్తలు