ఊగిసలాడుతున్న స్టాక్‌మార్కెట్‌, అదానీ షేర్లకు ఉత్సాహం

2 Jun, 2023 10:26 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో  ప్రారంభమైనాయి. కానీ కొద్దిసేపటికే అమ్మకాల వెల్లువతో 200 పాయింట్ల లాభంతో ఆరంభంమైన సెన్సెక్స్‌  నష్టాల్లోకి జారుకుంది.  62422 వద్ద, నిఫ్టీ 19490 వద్ద ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. 

హీరోమోటోకార్ప్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటాస్టీల్‌, టెక్‌ మహీంద్ర బాగా లాభపడుతుండగా, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐషర్‌ మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌, సిప్లా టాప్‌ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. 

 హుషారుగా అదానీ గ్రూపు షేర్లు
ఏఎస్ఎం ఫ్రేమ్‌వర్క్ నుండి అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్  సెక్యూరిటీలను తొలగించిన తర్వాత శుక్రవారం ట్రేడింగ్‌లో అదానీ  ఎంటర్‌ప్రైజెస్ దాదాపు 2 శాతం పెరిగింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను మే 24న స్వల్పకాలిక అదనపు నిఘా ఫ్రేమ్‌వర్క్ కింద ఉంచిన సంగతి తెలిసిందే.  అదానీ పోర్ట్స్‌  కూడా స్వల్పంగా లాభపడుతోంది. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప లాభంతో 82.32 వద్ద  కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు